గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 20 ఫిబ్రవరి 2021 (16:17 IST)

ఏనుగుపై నగ్నంగా ఎక్కి పడుకుంది, దాన్ని చూసిన వారంతా...

ఫోటో కర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
22 ఏళ్ల రష్యన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అలెసియా కాఫెల్నికోవా, అంతరించిపోతున్న సుమత్రన్ ఏనుగు పైన నగ్నంగా పడుకుని ఫోజిలివ్వడాన్ని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యంగా, ఇన్ల్పుయెన్సర్-మోడల్ మాజీ ప్రపంచ నంబర్ 1 టెన్నిస్ క్రీడాకారుడు కాఫెల్నికోవ్ కుమార్తె.

సుమత్రన్ ఏనుగుపై నగ్నంగా పడుకుని వున్న వీడియోను అలెసియా ఫిబ్రవరి 13న తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో జోడిస్తూ “నేచురల్ వైబ్స్” అని క్యాప్షన్ పెట్టింది. ఇది చూసిన జంతు ప్రేమికులు ఆమెను తీవ్రంగా విమర్శించారు. దీనితో ఆ వీడియో తొలగించబడింది.

ఆమె పోస్ట్‌లోని వ్యాఖ్యలలో ఒకటి, “ఇది మంచి చర్య కాదు, ఏనుగును వదిలి కుర్చీ లేదా మరేదైనా వాడండి. ఇది క్రూరత్వం, అసలు నీవు ఏనుగుపై ఎందుకు నగ్నంగా ఎక్కావు? మిమ్మల్ని నగ్నంగా చూడటానికి అందరూ ఆసక్తి చూపుతున్నారా? అంటూ కామెంట్ పోస్ట్ చేసాడు.