1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Formula E Race case: KTR respond after second round of ACB enquiry

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

ktrao
ఫార్ములా ఈ-రేస్ కారులో అవినీతి ఎక్కడ జరిగిందని ప్రశ్నించగా, ఏసీబీ అధికారుల వద్ద ఎలాంటి సమాధానం లేదని భారస వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. పైగా తొమ్మిది గంటల పాటు ఒకటే ప్రశ్నను అటు తిప్పి, ఇటు తిప్పి అడిగారే గానీ కొత్త ప్రశ్నంటూ ఏదీ లేదన్నారు. చిట్టినాయుడు రాసిచ్చిన ప్రశ్నలు తప్ప అక్కడ ఏమీ లేదన్నారు. ఫార్ములా ఈ-రేస్ రెండో సంవత్సరం ఇక్కడి నుంచి తరలిపోవద్దనే విధానపరమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. దీంతో అవినీతి ఎక్కడ ఉంది అని ఏసీబీ ప్రశ్నిస్తే వారి వద్ద ఎలాంటి సమాధానం లేదన్నారు.
 
ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్ సోమవారం హాజరయ్యారు. ఆయన వద్ద ఏకంగా 7 గంటల పాటు అధికారులు విచారణ జరిపారు. ఉదయం నుంచి ప్రారంభమైన ఈ విచారణలో మొత్తం 60 ప్రశ్నలను కేటీఆర్‌పై సంధించినట్టు సమాచారం. ఈ కేసులో కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 
 
తర్వాతి కథనం
Asaduddin Owaisi: నారా లోకేష్ భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేశారు: ఓవైసీ