నితిన్ మాస్ట్రో స్నీక్ పీక్ విడుదల
హీరో నితిన్ వైవిధ్యమైన పాత్రలో నటించిన చిత్రం మాస్ట్రో. కళ్లు కనిపించని దివ్యాంగుడైన పియానో ప్లేయర్‌గా నితిన్ నటించారు. ఇది ఆయన కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా రూపొందుతోన్న 30వ చిత్రం. టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. కోవిడ్ వల్ల ఏర్పిడిన పరిస్థితుల కారణంగా ఈ సినిమాను థియేటర్స్ విడుదల కాకుండా ప్రముఖ ఓటీటీ డిస్నీ హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 17న డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ అవుతుంది.
ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ రాగా రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సోమవారం ఈ సినిమా నుంచి స్నీక్ పీక్‌ను విడుదల చేశారు. స్నీక్ పీక్‌ను గమనిస్తే.. పియానోపై ఇంపైన ట్యూన్ వాయిస్తుండగా, పియానోపై మాస్ట్రో ఇళయరాజా ఫొటోను గమనించవచ్చు. ట్యూన్ చేస్తుండగా పియానో ఆగిపోతుంది. మంచి ట్యూన్ కుదరడం లేదని అనుకుంటుంటే, ఇప్పుడు పియానో పాడైందని హీరో నితిన్ అసహనం వ్యక్తం చేస్తాడు.
మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వై.యువరాజ్ సినిమాటోగ్రాఫర్. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డి మాస్ట్రో చిత్రాన్ని నిర్మించారు.
నటీనటులు:
నితిన్, నభానటేష్, తమన్నా, నరేష్, జిస్సూ సేన్ గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్దన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాసరెడ్డి
సాంకేతిక వర్గం:
డైరెక్షన్, డైలాగ్స్: మేర్లపాక గాంధీ, నిర్మాతలు: ఎన్. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి, సమర్పణ: రాజ్‌కుమార్ ఆకేళ్ళ, మ్యూజిక్ డైరెక్టర్: మహతి స్వరసాగర్, డీఓపీ: జె యువరాజ్