గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (16:06 IST)

బప్పీలహరి సంగీతంతో చదలవాడ శ్రీనివాసరావు చిత్రం

srinivas-Bappilahari
డిస్కోకింగ్ బప్పీలహరి చాలా కాలం త‌ర్వాత తెలుగు సినిమా చేస్తున్నారు. `బిచ్చ‌గాడు` నిర్మాత సోదరుడు చదలవాడ శ్రీనివాస రావు ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. ఇది భారీ యాక్షన్ చిత్ర‌మ‌ని చిత్ర దర్శకుడు జి. రవికుమార్ తెలియజేశారు.
 
చదలవాడ తిరుపతిరావు ఆయన సోదరుడు చదలవాడ శ్రీనివాస రావు తాజాగా నిర్మించబోయే ఈ సినిమాలో వారే నిర్మించిన `రోజ్ గార్డెన్‌` హీరో నితిన్ నాష్ ఈ నూతన చిత్రంలో కూడా హీరో గా నటించనున్నారు. "రోజ్ గార్డెన్" సంగీతంతో కూడిన ప్రేమ కథాచిత్రం అయినప్పటికీ ఆ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాల్లో సాహసవంతంగా ఫైట్లు అదరగొట్టిన హీరో నితిన్ నాష్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ కుర్రాడు యాక్షన్ హీరోగా రాణించగలడనే పూర్తి నమ్మకంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని ప్లాన్ చేసినట్లు చదలవాడ తిరుపతిరావు వెల్లడించారు.
 
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, శ్రీలంక, దుబాయ్, ఈజిప్ట్, మలేసియా దేశాల్లో షూటింగ్ జరుపుకునే ఈ తాజా చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదలకు అనుకుంటున్నాం. అలాగే ఇతర నటీనటులు, సాంకేతికనిపుణుల ఎంపిక జరుగుతోంది. హాలీవుడ్ కి చెందిన యాక్షన్ కొరియోగ్రాఫర్లను కూడా సంప్రదిస్తున్నాం" అని చెప్పారు.
 
అతి త్వరలో రోజ్ గార్డెన్
 
కాశ్మీర్ లో భారీ ఎత్తున హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన 1రోజ్ గార్డెన్1 చిత్రం ప్రస్తుతం ప్రసాద్ ల్యాబ్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది. డాల్బీ మిక్సింగ్, డి ఐ పనుల దశలో ఉన్న ఈ చిత్రాన్ని నిర్మాతలు అతి త్వరలో విడుదల చేయబోతున్నారు.