శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (15:46 IST)

రామ్ గోపాల్ వర్మ వీడియో వైరల్..

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల ఇనయా సుల్తానాతో డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. 
 
ఇనయా సుల్తానా పుట్టిన రోజు వేడుకలో వర్మ సుల్తానాలో కలసి రంగీలా సినిమాలోని పాటకు స్టెప్పులు వేశాడు. ఆమె కాళ్లపై పడిపోయాడు. దీనిపై సోషల్ మీడియా నుండి టీవీ డిబేట్ల వరకు ఎన్నో జరిగిపోగా అందుకు వర్మ కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చాడు.
 
తాజాగా వీరిద్దరి డాన్స్ చేసిన మరో వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఇది స్వయంగా ఇనయా సుల్తానా ఖాతా నుండి షేర్ అవగా దానికి వర్మ ఖాతా కూడా ట్యాగ్ చేసింది. ఇందులో ఒరిజినల్ సౌండ్స్ కూడా ఉండడంతో మరోసారి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
 
మరోవైపు ఈ వీడియోలలో సుల్తానా, వర్మతో పాటు ఉన్న నటి జ్యోతి, మరో నటుడు వర్మ దేవుడు ఆయన మీద పడిఏడవడం ఎందుకంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో పలు పోస్టులు కూడా పెట్టగా వర్మ అభిమానులు కూడా ఆయన్ని వెనకేసుకొస్తున్నారు.