గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (18:05 IST)

మాస్ట్రో నుంచి వెన్నెల్లో ఆడిపిల్ల పాట వ‌చ్చేసింది

nitin-mastro
హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం డైరెక్టగా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌లో విడుద‌ల‌వుతున్న ఈ సినిమా నితిన్ ల్యాండ్ మార్క్‌గా న‌టిస్తోన్న 30వ చిత్రం. కోవిడ్ ప‌రిస్థితుల ప్ర‌భావం కార‌ణంగా నితిన్ త‌న ‘మాస్ట్రో’ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేస్తున్న‌ట్లు తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి ‘వెన్నెల్లో ఆడిపిల్ల... ’ అనే సాంగ్ ప్రోమోను విడుద‌ల చేసిన నిర్మాత‌లు ఇప్పుడు పూర్తి సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్‌లో నితిన్‌, న‌భా న‌టేశ్ న‌టించారు.  ఈ పాట‌ను స్వీక‌ర్ అగ‌స్తి పాడారు.
 
విదేశాల్లో పెర్ఫామ్ చేస్తున్న నితిన్‌ను చూసి న‌భా న‌టేశ్ ఆశ్చ‌ర్య‌పోవ‌డంతో ఈ పాట ప్రారంభం అవుతుంది. ఈ సాంగ్‌ను గోవా బ్యాక్‌డ్రాప్‌లో నితిన్‌, న‌భాల మ‌ధ్య ఉండే అంద‌మైన ప్రేమ‌క‌థ‌ను చూడొచ్చు. ఈ సినిమాలో చాలా ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఈ పాట రివీల్ చేస్తుంది. అలాగే త‌మ‌న్నా భాటియాతో స‌హా సినిమాలో న‌టించిన ప్ర‌ధాన తారాగ‌ణం జిషుసేన్ గుప్తా, మంగ్లీల‌ను కూడా పాట‌లో చూడొచ్చు.
మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్‌నుంచి విడుద‌లైన మ‌రో చార్ట్ బ‌స్ట‌ర్ నెంబ‌ర్ ఇది. క‌చ్చితంగా పాట‌ల‌ను ఇష్ట‌ప‌డేవారికి న‌చ్చేలా ఉందీ పాట‌. శ్రీజో, కృష్ణ చైత‌న్య ఈ పాట‌కు సాహిత్యాన్ని అందించారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్‌ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డి 'మాస్ట్రో' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.