శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : ఆదివారం, 11 జులై 2021 (00:15 IST)

నాగార్జున సినిమాలో కృతిశెట్టి (video)

Kriti
`ఉప్పెన‌`లో కృతిశెట్టి న‌టించాక ఆమెకు ఆఫ‌ర్ల బారులు తీరాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ కోవ‌లోనే నిఖిల్ హీరోగా `18పేజీస్‌`న‌టిస్తుంద‌ని అన్నారు. ఆ త‌ర్వాత తేజ ద‌ర్శ‌క‌త్వంలో సురేష్‌బాబు కుమారుడు అభిరామ్ ప‌క్క‌న న‌టిస్తోందని పుకార్లు వ‌చ్చాయి. మ‌రోవైపు బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ సోద‌రుడు గ‌ణేష్ హీరోగా ఓ సినిమా రాబోతుంది. అందులోనూ ఆమె న‌టిస్తుంద‌ని వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇలా ఉప్పెన వంటి సినిమా హిట్ అయ్యాక ఆమెకు అవ‌కాశాలు రావ‌డం వ‌ర‌కు క‌రెక్టే.
 
కానీ అవేవీ నిజంకాద‌ని కృతిశెట్టి సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. కానీ ఈసారి పెద్ద సంస్థ‌లో న‌టించే అవ‌కాశాన్ని కొట్టేసింది. అది కూడా నాగార్జున న‌టిస్తున్న సినిమా. సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమాకు సీక్వెల్‌గా `బంగారు బాల్రాజు` తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాకు ద‌ర్శ‌కుకు క‌ళ్యాణ‌కృష్ణ ప‌లువురు పేర్లు హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే ఇందులో నాగ చైత‌న్య కూడా న‌టించ‌నున్నాడు.

ఆయ‌న ప‌క్క‌న ముందుగా స‌మంత‌ను అనుకున్నారు. కానీ అనుకోకుండా కృతి పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. స‌మంత ఇటీవ‌లే గుణ‌శేఖ‌ర్ సినిమా షూటింగ్‌లో ప్ర‌వేశించింది. ఆ చిత్ర డేట్స్ కుద‌ర‌క కృతిని సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తోంది. ఇదేకాకుండా నితిన్ కొత్త సినిమాలో కృతిని చిత్ర యూనిట్ ప్ర‌తిపాదించిందట‌. దీనికి శేఖ‌ర్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం కాబోతున్నాడు. మ‌రి ఒక హిట్ ఎంత ప‌నిచేసిందోగ‌దా.