శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (18:09 IST)

సమంతలో వచ్చిన ఆ మూడు మార్పులు.. ఏంటవి..?

ఏ మాయ చేశావే సినిమాతో సిల్వ‌ర్ స్క్రీన్‌పై మెరిసి మాయ చేసింది చెన్నై అందం స‌మంత‌. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చి వ‌న్ ది లీడింగ్ స్టార్ హీరోయిన్‌గా త‌న హ‌వా కొన‌సాగిస్తోంది. అప్ క‌మింగ్ హీరోహీరోయిన్ల‌కు వ్య‌క్తిగ‌తంగా, వృత్తిప‌రంగా స్ఫూర్తిగా నిలుస్తోంది. త‌న పద‌కొండేళ్ల ప్ర‌యాణంలో మూడు ప్ర‌ధానమైన మార్పులు వ‌చ్చాయ‌ని చెప్పింది సామ్‌. 
 
ఇటు వెండితెరపైనే కాకుండా.. సమంత డిజిటల్ ఫ్లాట్‍ఫామ్‏లో కూడా తన హావా కొనసాగిస్తుంది. ఇటీవల విడుదలైన “ఫ్యామిలీ మ్యాన్ 2″ వెబ్ సిరీస్‏లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సూపర్ హిట్ సిరీస్‏ తర్వాత డిజిటల్ వేదికపై కూడా ఆఫర్లు క్యూ కట్టాయి.
 
ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స‌మంత మాట్లాడుతూ.. నేను చాలా చాలా హార్డ్ వ‌ర్క్ చేసే వ్య‌క్తిని. అంతేకాదు అభ‌ద్ర‌తా భావం, అనేక స్వీయ అనుమానాల‌తో ఉండేదానిని. కానీ ఇన్నేళ్లు గ‌డిచిన త‌ర్వాత నాలో ఉన్న అభ‌ద్ర‌తాభావాన్ని ఎలా త‌గ్గించుకోవాలో, పెద్ద పెద్ద రిస్క్‌లు తీసుకోవ‌డం నేర్చుకున్నా. ఇపుడు నాలో చాలా ఆత్మ‌విశ్వాసం ఉంది. భ‌యం, అభ‌ద్ర‌తను వ‌దిలిపెట్టి పెద్ద రిస్క్‌ల‌నైనా తీసుకోవ‌డం లాంటి మూడు మార్పులు త‌న‌లో వ‌చ్చాయ‌ని చెప్పుకొచ్చింది.
 
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుతం డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుంది. అంతేకాకుండా.. ఇటీవల జ్యూవెల్లరీ వ్యాపారాన్ని కూడా సామ్ ప్రారంభించింది.