బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 3 జులై 2021 (20:27 IST)

`మా`లో కుంభ‌కోణం అందుకే ప్ర‌కాష్‌రాజ్ తెర‌పైకి?

MAA logo
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌లో భారీ కుంభ‌కోణం జ‌రిగింద‌నీ, దాన్ని క‌ప్పిపుచ్చుకునేందుకు అధ్య‌క్షుని ఎన్నిక‌ల‌లో ప్ర‌కాష్‌రాజ్‌ను ప్ర‌వేశ‌పెట్టార‌ని స‌భ్యుల‌లోనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ కుంభ‌కోణానికి సూత్ర‌దారుడు మెగా సోద‌రుడు నాగ‌బాబేన‌ని తెలుస్తోంది. ఆయ‌న అధ్య‌క్షునిగా వుండ‌గానే `మా` కు ఓ కొత్త భ‌వ‌నం కోసం స్థ‌లం తీసుకున్నార‌ట‌. అది జూబ్లీహిల్స్‌లోని ఓ లిటికేష‌న్ లాండ్‌. దానిని అప్ప‌ట్లో 45 ల‌క్ష‌లు కొని, దాన్ని అభివృద్ధికి మ‌రో 50ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెట్టార‌ట‌. ఇదంతా మా క‌మిటీలోని వారే ప్రోత్స‌హించార‌ని తెలిసింది. అది చిలికి చిలికి గాలివాన‌గా మార‌డంతో అప్ప‌ట్లో దాన్ని అమ్మ‌కానికి పెట్టారు. కానీ లిటికేష‌న్ లాండ్, పైగా వాస్తుకూడా స‌రిగ్గా లేక‌పోవ‌డంతో రేటు రాలేదు. ఓ ముస్లిం వ్య‌క్తి దానిని పెద్దల పంచాయితీలో 35 ల‌క్ష‌లు కొనుగోలుచేసిన‌ట్లు గుస‌గ‌స‌లు వినిపిస్తున్నాయి. 
 
ఇవే కాకుండా క్రికెట్ మ్యాచ్‌ల పేరుతో వ‌చ్చిన ఆదాయంలోనూ కొంత కొరివి ప‌డింది. దాని లెక్క‌లు స‌రిగ్గాలేవ‌ని సీనియ‌ర్ న‌రేస్ అధ్య‌క్ష‌త‌న బాడీ ఆధ్వ‌ర్యంలో పాత క‌మిటీని నిల‌దీశారు. దీనికితోడు ప్రింటింగ్ స్టేష‌న‌రీ లోనూ చేతులు మారాయని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఇవ‌న్నీ సినీ పెద్ద‌ల‌కు పీక‌ల‌మీద‌కు వ‌చ్చాయి. 
 
భ‌వ‌నం నిర్మిస్తే ప్ర‌కాష్‌రాజ్ పేరుంటుంది!
అందుకే వాటిని కంట్రోల్ చేయాలంటే అంద‌రికీ కావాల్సివాడు ప్ర‌కాష్‌రాజ్ అని అనుకుని ఆయ‌న‌కు సీనిపెద్ద‌లు స‌పోర్ట్‌గా నిలిచిన‌ట్లు తెలుస్తోంది. క‌నుక‌నే ప్ర‌కాష్‌రాజ్ వుంటేనే ఫండ్ రైజింగ్‌లో ఎక్కువ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఇటీవ‌లే నాగ‌బాబు బాహాట‌కంగానే ప్ర‌క‌టించారు. కేవ‌లం ఫండ్‌కోసం ఆయ‌న్ను నిల‌బెడుతున్న‌ట్లు అర్థ‌మ‌యింది. ఇది కాకుండా నాగ‌బాబు బాహాటంగా నాన్ లోకల్ స‌మ‌స్య కాద‌ని ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఇప్ప‌టికే సినీమారంగంలో వ్య‌తిరేక‌త మొద‌లైంది. మ‌రోవ‌ర్గం అయితే నాగ‌బాబు ఎవ‌రు? అస‌లు అంటూ నిల‌దీసేస్తున్నారు. 
 
అస‌లు మెగా ఫ్యామిలీ ప్ర‌కాష్‌రాజ్‌కు స‌పోర్ట్ చేయ‌డ‌మే అవ‌గాహ‌న‌లేని ప‌ని అని అంటున్నారు. దానికీ కార‌ణం లేక‌పోలేదు. మా అసోసియేష‌న్‌ను సీనియ‌ర్ న‌టులు ఆరంభించారు. మెగాస్టార్‌తోపాటు మోహ‌న్‌బాబు, బాల‌కృష్ణ‌, నాగార్జున‌వంటివారు అండ‌గా వున్నారు. రేపు ప్ర‌కాష్‌రాజ్ అధ్య‌క్షుడు అయితే ఎన్నో ఏళ్ళ `మా` భ‌వ‌న సాకారంలో భ‌వనాన్ని సాధించిన అధ్య‌క్షుడిగా ప్ర‌కాష్‌ఱాజ్ పేరు వుంటుంది. ఇది చాలా మందికి మింగుడు ప‌డ‌డంలేదు.