సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 28 జూన్ 2021 (11:46 IST)

లోక‌ల్ నాన్‌లోక‌ల్ చిచ్చు- రెండు ముక్క‌ల దిశ‌గా `మా`!

MAA elction
తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ రెండు ముక్క‌లు అయ్యేందుకు సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. మొన్న‌టివ‌ర‌కు ప్ర‌కాష్ రాజ్ రాక‌తో లోక‌ల్‌, నాన్ లోక్ అనే ఉచ్చు ఇప్పుడు ఆంధ్ర‌, తెలంగాణా ఉచ్చుగా మారబోతోంది. ఇందుకు మెగాఫ్యామిలీనే బాధ్య‌త‌గా కొంద‌రు ప్ర‌చారంచేస్తున్నారు. అస‌లు వివ‌రాల్లోకి వెళితే ఇంత‌కుముందే అంటే తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయ్యాక కె.సి.ఆర్‌. ఆధ్వ‌ర్యంలోనే సినిమా రంగం రెండు భాగాలుగా జ‌ర‌గాల్సివుంది. తెలంగాణ వ‌చ్చాక తెలుగు ఫిలించాంబ‌ర్ కార్యాల‌యాన్ని ఆక్ర‌మించేందుకు తెలంగాణ‌కు చెందిన కొంద‌రు ప్ర‌య‌త్నించారు.

ఛాంబ‌ర్ ప‌క్క‌నే గ‌ల క‌ల్చ‌ర్ క్ల‌బ్‌లో సినిమారంగానికి సంబంధించిన ఓ ప్రెస్‌మీట్ అప్ప‌ట్లో జ‌రిగింది. కెటి.ఆర్‌.కూడా హాజ‌రయ్యారు. అప్ప‌ట్లో కోదండ‌రామ్ కూడా వ‌చ్చారు. ఇక కార్య‌క‌ర్త‌ల‌తో అది రాజ‌కీయ మీటింగ్‌లా మారింది. మీటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడే `జై తెలంగాణ‌` అంటూ నినాదాలు కార్య‌క‌ర్త‌లు చేశారు. ఎఫ్.ఎన్‌.సి.సి. అంటే క‌ల్చ‌ర్ క్ల‌బ్‌ను చూసి అది మాకు ద‌క్కాల‌ని కొంద‌రు నినాదాలు చేశారు. మ‌రికొంద‌రు అక్క‌డ కుర్చీల‌ను త‌న్నారు కూడా. అంత‌లా అప్ప‌ట్లో ప్రాంతీయ‌వాదం నెల‌కొంది. ఆ త‌ర్వాత నాయ‌కులు స‌ర్దుబాటుగా మాట్లాడారు. ఆ త‌ర్వాత ఎప్ప‌టికైనా ఇది పెద్ద త‌ల‌నొప్పిగా మారుతుందిన గ్ర‌హించిన ఛాంబ‌ర్ పెద్ద‌లు. ఫిలింఛాంబ‌ర్ పేరును తెలుగు చ‌ల‌న చిత్ర ఫిలింఛాంబ‌ర్‌గా మార్చారు. ఆ త‌ర్వాత `మా`లోనూ న‌టీనటులు వేరు వేరుగా రెండు అసోసియేష‌న్‌లు ఏర్ప‌డ్డాయి. అందులో రామ‌కృష్ణ గౌడ్ కీల‌క పాత్ర పోషించారు. 
 
ప్ర‌కాష్‌రాజ్ త‌ల‌నొప్పిగా మారాడా!
ఇక ఇప్పుడు చూస్తే, `మా` ఎన్నిక‌లు వేడి అంద‌రికీ తెలిసిందే. ప్ర‌కాష్‌రాజ్ పోటీకి నిల‌బ‌డ‌డంతో ప‌క్క రాష్ట్రం వాడు అంటూ చ‌ర్చ మొద‌లైంది. క‌ళాకారుల‌కు అలాంటివిలేవ‌నీ నాగ‌బాబు మొన్న మీటింగ్‌లో వ్యాఖ్యానించారు. ఇక ఇప్పుడు అదే మాట బ్రహ్మాస్త్రంగా మారింది తెలంగాణా వారికి. అందుకే హుటాహుటిగా ఆదివారంనాడు తెలంగాణ వాదులు స‌పోర్ట్ మేర‌కు లాయ‌ర్ సి.ఎల్‌. న‌ర‌సింహారావు `మా` అధ్య‌క్ష పోటీలో నేనూ నిల‌బ‌డ‌తున్నాన‌ని ప్ర‌క‌టించారు.
 
తెలంగాణ `మా`గా సెప‌రేట్ చేయాల్సిందే
ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌ముఖ ఛాన‌ల్ లో చ‌ర్చ‌లో పాల్గొని అస‌లు తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అనే దానిలో తెలంగాణ వారికి ప్రాధాన్య‌త లేదు. అందుకే మా తెలంగాణ‌, మా ఆంధ్ర అంటూ రెండుగా చేయాల‌ని తేల్చి చెబుతున్నారు. అంత‌కుముందు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ వ‌టివారు తెలంగాణ ఛాంబ‌ర్ అనేది సికింద్రాబాద్‌లో పెట్టారు. కాల‌క్ర‌మేణా అది యాక్టివ్‌గా లేదు. ఇప్పుడు `మా` తెలంగాణ అనేవారు ధైర్యంగా ముందుకు నాతో క‌లిసి రండి అంటూ స‌వాల్ విసురుతున్నారు.
 
మెగా ఫ్యామిలీ మ‌ల్ల‌గుల్లాలు
`మా` ఎన్నిక‌లు ఈసారి పెద్ద స‌మ‌స్య‌గా మారాయ‌నేది సీనీ పెద్ద‌ల‌కు అర్థ‌మ‌యింది. అన‌వ‌స‌రంగా ప్ర‌కాష్‌రాజ్‌ను పెట్టి త‌ప్పుచేశామా? అనేది డైల‌మాలో వున్నారు. ఇప్ప‌టికే మెగాస్టార్ ఫ్యామిలీ ఆయ‌న‌కు స‌పోర్ట్ చేయ‌డంకూడా పెద్ద త‌ప్పుగా మారింది. పైగా నాగ‌బాబు ముందుకు వ‌చ్చి లోక‌ల్ నాన్‌లోక‌ల్ అనేది క‌ళాకారుడు వుండ‌దు అని తేల్చి చెప్పారు. మ‌రీ అదే ఆయ‌న‌కు స‌మ‌స్య‌గా మారింది. ముందు ముందు ఆంధ్ర‌, తెలంగాణా స‌భ్యులు ఎవ‌రులోక‌ల్‌, ఎవ‌రు నాన్ లోక‌ల్ అనేది పెద్ద స‌మ‌స్య‌గా మార‌బోతుంది. రెండుగా  చీలాల్సిందే అంటూ స‌భ్యులు ఇప్ప‌టికే వాట్స‌ప్‌లో మెసేజ్‌లు పెడుతున్నారు. మ‌రి మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఏమంటుందో చూడాలి.