తనపై వున్న విమర్శకు సమాధానం చెప్పలేకపోయిన ప్రకాష్‌రాజ్
`మా` ఎన్నికలు రసపట్టులో వున్నాయి. మూడునెలల క్రితమే ప్రకాష్‌రాజ్ మెగాస్టార్ చిరంజీవిని కలిసి తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నానని తెలియజేశాడు. అందుకు ఆయన సపోర్ట్ కూడా వుంది. అందుకే స్లోగన్ కూడా ఆకట్టుకునే పెట్టాడు.
ప్రకాష్ రాజ్ సిని'మా' బిడ్డల ప్యానెల్
సిని'మా' బిడ్డలం
మనకోసం మనం
'మా' కోసం మనం.. అంటూ కాప్టన్‌లు పెట్టి అందరినీ కలుపుకొనేరీతిలో వున్నాడు. ఇప్పుడు అదే ఆయనకు ప్రధాన చిక్కు తెచ్చిపెట్టింది. ప్రకాష్‌రాజ్ తీరుపై గతంలో పలుసార్లు ఫిలింఛాంబర్‌లో నిర్మాతలు, `మా` అసోసియేషన్‌లో దర్శక నిర్మాతలు కూడా ఫిర్యాదు చేశారు. షూటింగ్ వుంటే సరిగ్గారాడనీ, చివరి నిముషంలో కాన్సిల్ చేస్తాడని అపవాదు గట్టిగా వుంది. అందుకు ఆయన సంజాయిషీలు, ఫైన్‌లు కూడా కట్టిన సందర్భాలు వున్నాయి. ఇప్పుడు ఇవే పెద్ద సమస్యగా మారాయి. ఈ విషయాన్ని ఓ విలేకరి అడుగుతూ, దీనికి ఏమి సమాధానం చెబుతారు. మీరు అధ్యక్షుడిగా నిలబడేటప్పుడు ఇవన్నీ ఆలోచించలేదా? అంటూ ప్రశ్నించారు.
అందుకు ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ, నాకు వ్యక్తిగతంగా కొన్ని పనులుంటాయి. నేను బిజీ, భార్య, పిల్లలు, వ్యక్తిగత పనులు ఇలా చాలా పనులతో బిజీగా వున్నప్పుడు అన్నిటినీ చూసుకోవాలి. అంటూ అసలు విషయం చెప్పకుండా సమాధానం ముగించారు. దీనితో ఇష్యూను ఇంకా ఎక్కువ చేయడం తగదని భావించిన ఇతర సీనియర్ సభ్యులు ఆ విషయాన్ని అంతటితో ముగించారు. ఇప్పటికే ప్రకాష్‌రాజ్‌ను బెంగుళూరు, చెన్నైలలో ఎన్నికల్లో నిలబడితే ఓడించారు. అందుకే హైదరాబాద్ వచ్చాడని టాక్ ప్రబలంగా వనిపిస్తోంది.