సంబంధిత వార్తలు
- అదనపు కట్నం కోసం కోడలి జట్టు పట్టి లాగి కొడుతూ... నిప్పంటించిన అత్త... ఎక్కడ?
- నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ- రూ.5,000 కోట్ల ఆర్థిక సాయంపై విజ్ఞప్తి
- ChatGPT: న్యూఢిల్లీలో ఓపెన్ ఏఐ యూనిట్- రూ.399 నెలవారీ ప్లాన్‌తో చాట్‌జీపీటి జీవో
- వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు స్టే: కారు ఎక్కి దర్జాగా వెళ్తున్న వీధి కుక్క (video)
- ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..
రైలులో నిద్రిస్తున్న మహిళను అసభ్యంగా తాకిన కానిస్టేబుల్
రైలు ప్రయాణంలో మహిళల రక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ తానే ఓ మహిళను వేధించాడు. రక్షించాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తే అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు. కోచ్‌లో చీకటిగా ఉండటంతో తన చర్యలను ఎవరూ గమనించలేరనే ఉద్దేశ్యంతో ఈ పాడుపనికి పాల్పడ్డాడు. అయితే, నిద్ర నుంచి మేల్కొన్న ఆ మహిళ గట్టిగా పట్టుకుంది. కళ్లు తెరిచి చూడగా కానిస్టేబుల్ కనిపించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ వివరాలను వెళితే, ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ వెళుతున్న ట్రెయిన్‌లో మహిళల భద్రతను కాపాడిన జీఆర్‌పీ కానిస్టేబుల్ ఆశిష్ గుప్తా దారుణంగా ప్రవర్తించాడు. రాత్రి వేళలో లైట్లు ఆఫ్ చేసి ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న అతను, నిద్రలో ఉన్న ఓ మహిళను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించాడు. యువతి నిద్రలేచి పట్టుకోవడంతో క్షమించాలని వేడుకున్నాడు. మహిళ ఫిర్యాదుతో ఉన్నతాధికారుల స్పందించి ఆశిష్ గుప్తాను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.
GRP constable Ashish Gupta suspended for inappropriately touching a sleeping girl on a Delhi-Prayagraj train. Victim recorded video of incident, showing constable apologizing.
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 23, 2025
pic.twitter.com/JoG7T0m6em
