శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (13:38 IST)

రజనీకాంత్ "అన్నాత్త" ఫస్ట్ లుక్ రిలీజ్

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం "అన్నాత్త". ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ వినాయకచవితి పండుగను పురస్కరించుకుని రిలీజ్ చేసింది. 
 
మాస్ చిత్రాల దర్శకుడు శివ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు వంటి ప్రముఖ నటీ,నటులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. 
 
ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా వినాయక చవితి సందర్భంగా 'అన్నాత్త' నుంచి రజినీకాంత్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ లుక్ ఫ్యాన్స్‌నే కాకుండా ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.