బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఫిబ్రవరి 2022 (13:54 IST)

ఒడిశాలో నబ్రంగ్ పూర్ ఘోర్ రోడ్డు ప్రమాదం: ముగ్గురు పోలీసులు మృతి

ఒడిశాలోని నబ్రంగ్ పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోల్ డ్యూటీ సమయంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. ఇంకా 14 మందికి గాయాలయ్యాయి. 
 
వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని నబరంగ్ పూర్ జిల్లాలోని పాపదాహండి పోలీసు పరిధిలో సోరిస్పాడర్‌లో వారు ప్రయాణిస్తున్న బస్సు తిరగబడిన ఘటనలో ముగ్గురు పోలీసు సిబ్బంది మరణించగా, మరో 14 మంది గాయపడ్డారు. గాయపడిన వారందరినీ పాపదాహండి సిహెచ్‌సి, జిల్లా ఆసుపత్రికి తరలించారు.
 
నివేదికల ప్రకారం, పాపదాహండి నుండి కోసగుముడాకు సుమారు 40-45 మంది భద్రతా సిబ్బందితో వెళుతున్న బస్సు ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.
 
బ్రేకులు వేసినప్పటికీ డ్రైవర్ దానిని నియంత్రించలేకపోవడంతో బస్సు రోడ్డుపై నుండి జారిపడి మలుపు సమీపంలో 15 అడుగుల దూరంలో రోడ్డుపై కూలిపోయింది.