గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (22:54 IST)

100జీబీపీఎస్ స్పీడ్‌.. శాటిలైట్‌ బ్రాడ్‌బాండ్‌పై జియో పక్కా ప్లాన్

దేశంలో ఇంటర్‌నెట్‌ విప్లవానికి నాంది పలికిన రిలయన్స్‌ జియో శాటిలైట్‌ బ్రాడ్‌బాండ్‌ అందించేందుకు రెడీ అయ్యింది. ముకేశ్ అంబానీ రిలయన్స్ జియో ఎంట్రీతో ఇంటర్‌నెట్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 
 
డిజిటల్‌ ప్రపంచంలో మరోసారి తనదైన మార్క్‌ చూపించేందుకు తహతహలాడుతున్న రిలయన్స్‌.. ఈ సారి అంతర్జాతీయ దిగ్గజ సంస్థతో జత కట్టింది. లక్సెంబర్గ్‌కు చెందిన ఎస్ఈఎస్ కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. 
 
జియో ఫ్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్ ఎస్ఈఎస్ కలిపి… జియో స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్ పేరుతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాయి. 
 
ఈ కంపెనీల జాయింట్ వెంచర్ ద్వారా దేశవ్యాప్తంగా శాటిలైట్ బ్రాడ్‌బాండ్ సర్వీసులు అందించబోతున్నారు. 100జీబీపీఎస్ స్పీడ్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. 
 
దేశంలోని ఏ మూలకైనా శాటిలైట్ నుంచే ఇంటర్నెట్ సర్వీసులు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మల్టీ ఆర్బిట్ స్పేస్ నెట్‌వర్క్స్‌ ద్వారా సర్వీసులు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.