1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 ఫిబ్రవరి 2022 (22:02 IST)

బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ కన్నుమూత

Rahul Bajaj
ప్రముఖ పారిశ్రామిక వేత్త, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ పుణెలో తుదిశ్వాస విడిచారు. రాహుల్ బజాజ్ న్యూమోనియాతో బాధపడుతూ వచ్చారు. ఆయన గుండె సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడ్డారు. గత నెలలో ఆస్పత్రిలో చేరారు. నెలరోజుల నుంచి చికిత్స తీసుకున్నారు. చికిత్స ఫలించక ఆయన కన్నుమూశారు. 
 
రాహుల్ బజాజ్ 1938 జూన్ 10వ తేదీన జన్మించారు. బజాజ్ కంపెనీని క్రమక్రమంగా అభివృద్ధి చేశారు.  తక్కువ ధరలో టూ వీలర్ అందించారు. బజాజ్ చేతక్ రూపకల్పనలో రాహుల్ మంచి పేరు గడించారు. కంపెనీకి 40 ఏళ్లు చైర్మన్‌గా వ్యవహరించారు. 
 
భారతీయ కార్పొరేట్‌ పరిశ్రమలో తనదైన ముద్రను వేశారు. గత ఏడాది నుంచి వ్యవహరాల నుంచి తప్పుకున్నారు. అతనికి 2001లో పద్మ భూషణ్ అవార్డు లభించింది. అతను రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగారు.
 
2021లో పోర్బ్స్‌లో రాహుల్ బజాజ్ 421 ర్యాంకు సంపాదించారు. ఆయన మరణంతో భారత దేశ పారిశ్రామిక, వ్యాపార రంగాలు విషాదంలో మునిగిపోయాయి.