గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (13:07 IST)

ఫిబ్రవరి 28 నుండి స్కూళ్లు పునఃప్రారంభం

ఒడిశాలో రాబోయే పంచాయితీ ఎన్నికల కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం 1 నుండి 7 సంవత్సరాల విద్యార్థులకు ఆఫ్ లైన్ తరగతుల పునఃప్రారంభాన్ని వాయిదా వేయాలని నిర్ణయించింది. 
 
ఈ తరగతుల కోసం, పాఠశాలలు ఇప్పుడు ఫిబ్రవరి 28, 2022 నుండి పునఃప్రారంభం కానున్నాయి. అంతకుముందు ఫిబ్రవరి 14న స్కూల్స్ రీ ఓపెన్ చేయాలనుకున్నారు.   
 
సవరించిన నిబంధనలు విద్యార్థులకు మాత్రమే వర్తిస్తాయి. ఉపాధ్యాయులు మరియు సిబ్బందికి వర్తించవు. తదనుగుణంగా, బోధన మరియు బోధనేతర సిబ్బంది క్యాంపస్‌కు వచ్చి విద్యార్థుల కోసం ఏర్పాట్లు చేసేలా చూస్తారు. 
 
పంచాయితీ ఎన్నికల కారణంగా ఎటువంటి సమస్య రాకుండా ఉండటానికి, రాష్ట్ర ప్రభుత్వం ఈ పునఃప్రారంభాన్ని వాయిదా వేయాలని నిర్ణయించింది. 
 
ఒడిశా పంచాయితీ ఎన్నికలు 2022 ఫిబ్రవరి 16, 18, 20, 22 మరియు 24 వరకు 5 దశల్లో జరుగుతాయి. దీంతో పాఠశాలలను ఫిబ్రవరి 28 నుంచ పునఃప్రారంభించాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది.