సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (09:53 IST)

తెలంగాణాలో నేటి నుంచి కరోనా ఆంక్షల మధ్య స్కూల్స్

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నుంచి కరోనా ఆంక్షల మధ్య స్కూల్స్ ప్రారంభంకానున్నాయి. సంక్రాంతి సెలవుల తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలు, కాలేజీలు అన్నీ తెరుచుకోనున్నాయి. 
 
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్, ఒమిక్రాన్ వైరస్ కారణంగా సంక్రాంతి సెలవులను జనవరి 31వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొడగించిన విషయం తెల్సిందే. ఇపుడు వీటిని తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఈ స్కూల్స్ మంగళవారం తెరుచుకోనున్నాయి. 
 
అయితే, అన్ని పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది కరోనా నిబంధనలు పాటించనున్నారు. ముఖానికి మాస్క్, భౌతిక దూరం, శానిటైజర్ ఖచ్చితంగా అమలు చేయనున్నారు. కాగా, తెలంగాణా రాష్ట్రంలో సంక్రాంతి సెలవులను జనవరి 8వ తేదీ నుంచి ఇచ్చారు. సంక్రాంతి తర్వాత కరోనా వైరస్ మూడో దశ వ్యాప్తి ఒక్కసారిగా పెరగడంతో ఈ సెలవులను జనవరి 31వ తేదీ వరకు పొడగించారు.