1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 జనవరి 2022 (12:05 IST)

పబ్ యజమానులకు వార్నింగ్ ఇచ్చిన ఎక్సైజ్ శాఖ

హైదరాబాద్ నగరంలో పబ్‌ల సంస్కృతి పెరిగిపోతోంది. ముఖ్యంగా వీకెండ్ వచ్చిందంటే చాలు యువతీయువకులు పబ్బుల్లో వాలిపోతున్నారు. అయితే, ఇష్టంవచ్చినట్టుగా లౌడ్ స్పీకర్లలలో రణగొణ ధ్వనులతో పబ్బుల్లో కార్యక్రమాలు కొనసాగిస్తూ చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 
 
తాజాగా నగరంలోని ఈ పబ్బులకు సంబంధించి శబ్దాలపై ఎక్సైజ్ శాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. ముఖ్యంగా లైవ బ్యాండ్‌పై పలు ఆంక్షలు విధించింది. పబ్బుల్లో సౌండ్ పొల్యూషన్‌పై ఏదేని ఇబ్బదులు తలెత్తినా అసౌకర్యంగా అనిపించినా ఫిర్యాదు చేయాలని కోరారు. అలాగే, నగరంలోని పబ్బుల్లో శబ్దకాలుష్యాన్ని నివారించే దిశగా జూబ్లీ హిల్స్ పోలీసులు కీలక సూచనలు జారీచేశారు. 
 
పబ్లుల్లో శబ్దకాలుష్యానికి సంబంధించి ఏదేని ఫిర్యాదు ఉంటే 100 నంబరుకు డయల్ చేయాలని కోరారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనేక పబ్బుల్లో శబ్దకాలుష్యానికి సంబంధించిన  అనేక సమస్యలను పోలీసులు పరిష్కరించారు.