మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 29 జనవరి 2022 (17:27 IST)

కర్నాటకలో రోజుకి 30 వేల కోవిడ్ కేసులు: జనవరి 31 నుంచి నో కర్ఫ్యూ, ఎందుకంటే?

ప్రతిరోజూ కర్నాకటలో 30 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదవతున్నాయి. కనీసం 50 మంది చనిపోతున్నారు. ఐతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) నివేదిక ఆధారంగా నైట్ కర్ఫ్యూ, ఇతర ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం శనివారం ప్రకటించింది. బెంగళూరు నగరంలో 1-9 తరగతుల వరకు పాఠశాలలను ఆఫ్‌లైన్‌లో నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించింది.
 
 
రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్ మీడియాతో మాట్లాడుతూ, రికవరీ రేటు పెరుగుదల కారణంగా జనవరి 31 నుండి రాత్రిపూట కర్ఫ్యూను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. రికవరీ రేట్లు పెరుగుతున్నాయనీ, ఈసారి తీవ్రత తక్కువగా ఉందన్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, పబ్‌లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి సీటింగ్ కెపాసిటీతో పనిచేయగలవని ఆయన చెప్పారు.

 
సినిమా హాళ్లు. మల్టీప్లెక్స్‌లు 50 శాతం సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతించబడ్డాయని అన్నారు. వివాహాలు 300 మందితో బహిరంగ వేదికలలో, 200 మంది క్లోజ్డ్ ప్లేస్‌లో నిర్వహించవచ్చు. రోజువారీ ఆచారాల కోసం మతపరమైన ప్రదేశాలు తెరవబడతాయి. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం ప్రజలను అనుమతిస్తామని ఆయన తెలిపారు. స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, స్పోర్ట్స్ స్టేడియాలు 50 శాతం సామర్థ్యంతో పనిచేయగలవన్నారు.