వీకెండ్ లాక్‌డౌన్ ఎత్తివేసే దిశగా కర్ణాటక.. కారణం ఏంటంటే?
కరోనా విజృంభించడంతో వారాంతపు లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. దీనిపై సామాన్య ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని.. వాటిపై చర్చించిన తర్వాత.. నిపుణుల సూచన మేరకు వీకెండ్ లాక్‌డౌన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నామని కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి అశోక్. వెల్లడించారు.
ఇక, రాజధాని బెంగళూరు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కొనసాగుతాయని స్పష్టం చేసిన ఆయన.. ఇదే సమయంలో రాత్రి కర్ఫ్యూను మాత్రం యథావిధిగా ఈ నెలాఖరు వరకు కొనసాగిస్తామని తేల్చేశారు.
కానీ, బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, జాతరలకు అనుమతి లేదని… పబ్‌లు, క్లబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లలో 50 శాతం సీట్ల సామర్థ్యానికే అనుమతి ఉందన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు తదితర ప్రాంతాల్లో ప్రజలు గుంపులు చేరోద్దని స్పష్టం చేసింది ప్రభుత్వం.