బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

కర్నాటక రాష్ట్రంలో ఘోరం.. డివైడర్‌ను ఢీకొని ఏడుగురు మృతి

కర్నాటక రాష్ట్రంలోని దావనగెరెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో అమిత వేగంతో వచ్చిన కారు ఒకటి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వీరంతా బెంగుళూరులో ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. 
 
శుక్రవారం వేకువజామున 4 గంటల సమయంలో జరిగింది. డావనగెరె సమీపంలోని జగలూరు వద్ద కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ప్రమాద స్థలంలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.