మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జనవరి 2022 (10:41 IST)

వృద్ధురాలి ఖాతాలోకి ఏకంగా రూ.10 కోట్లు.. ఎలా వచ్చాయి..?

వృద్ధురాలి ఖాతాలో లక్షలు కాదు కోట్ల రూపాయలు జమ అయ్యాయి. దీంతో ఆ వృద్ధురాలు షాక్ కాక తప్పలేదు. వివరాల్లోకి వెళితే  పింఛన్‌తో జీవితం సాగించే వృద్ధురాలి ఖాతాలోకి ఏకంగా రూ.10 కోట్ల నగదు జమ అయిన ఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  
 
రాయచూరుకు చెందిన తాయమ్మకు 65 ఏళ్లు. నెలకు ఆమెకు మూడు వేల రూపాయలు పింఛన్‌గా వస్తోంది. గత ఏడాది డిసెంబర్ 20న ఈ అవ్వ ఖాతాలోకి రూ.10 కోట్ల 38 లక్షల 62 వేల నగదు జమైంది.
 
అదే నెల 31న తాయమ్మ గుంజళ్లిలోని బ్యాంక్‌కు వెళ్లి పింఛన్‌ డ్రా చేసుకుని ఇంటికి వచ్చింది. ఆమె వెంట వెళ్లిన వ్యక్తి తాయమ్మ ఖాతాలో రూ.కోట్లలో నగదు ఉండటాన్ని గుర్తించాడు. రూ.8 లక్షలు డ్రా చేయాలని చెప్పి జనవరి 1న బ్యాంకుకు తీసుకొని వెళ్లాడు. బ్యాంకు అధికారులు అనుమానం వచ్చి ఖాతాను పరిశీలించగా కోట్లలో నగదు ఉండటంతో విస్తుపోయారు.
 
దీనిపై విచారణ చేస్తామని, అప్పటివరకు డబ్బు డ్రా చేయవద్దని చెప్పి వారిని వెనక్కి పంపారు. దీనిపై బ్యాంకు అధికారులు విచారణ జరుపుతున్నారు.