బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (16:04 IST)

72 యేళ్ళ వృద్ధిరాలిపై అత్యాచారం - కామాంధుడు అరెస్టు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో 72 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి తెగబడిన కామాంధుడుని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఈ నిందితుడి వయసు 52 యేళ్లు. ఈ నిందితుడుని అరెస్టు చేశారు. 
 
జగదీశ్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 72 ఏళ్ల మహిళ నవంబర్ 14 సాయంత్రం పని నిమిత్తం ఇంటి నుంచి బోడ్లా అనే ఊరికి వెళ్లింది. అయితే ఆమెను ఓ వ్యక్తి.. పని ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. 
 
నిందితుడి మాటలు నమ్మిన వృద్ధురాలు అతనితో పాటు వెళ్లిందని అని పోలీసులు తెలిపారు. అయితే 'తనను ఓ ఇంట్లో బందీగా చేసి అత్యాచారానికి పాల్పడ్డినట్లు ఆమె వాపోయింద'ని వివరించారు.
 
అక్కడి నుంచి తప్పించుకున్న వృద్ధురాలు.. సోమవారం తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడ్ని విచారిస్తామని తెలిపారు.