మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జనవరి 2022 (18:58 IST)

కరోనా ఎఫెక్ట్.. ఆ ఐదు రాష్ట్రాల్లో ప్రచారం మరో వారం బ్యాన్

కరోనాతో పాటు కొత్త వేరియంట్ కోవిడ్ తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు నిషేధానికి గురయ్యాయి. రోజురోజుకీ కేసుల తీవ్రత పెరిగిపోతోంది. 
 
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ పొడిగించింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఇతర అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, ఇతర కమీషనర్లు సమావేశమయ్యారు. 
 
ఈ సమావేశంలో మరో వారం రోజుల పాటు నిషేధాన్ని పొడిగిస్తున్నట్టు ఈసీ వెల్లడించింది. దేశంలో కరోనా దృష్ట్యా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా మరియు పంజాబ్‌లకు ఈ నెల 8 నుంచి 15 వరకు ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతి లేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఇప్పుడా నిషేధాన్ని ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించింది.