యూపీ అసెంబ్లీ ఎన్నికలు- గోరఖ్‌పూర్ నుంచి యోగి పోటీ
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్నీ పార్టీలు సిద్ధం అవుతున్నాయి. యూపీ ఎన్నికల కోసం దేశంలోని అన్నీ పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి.
యూపీ ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టేందుకు దేశంలోని బీజేపీయేతర పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నాయి. ఈక్రమంలో అధికార బీజేపీ శనివారం మొదటి జాబితాను విడుదల చేసింది.
ఈ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ప్రతిపక్ష పార్టీ అధినేతలు..ఇంకా ఒక నిర్ణయానికి రాకముందే, బీజేపీ అభ్యర్థి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో దించుతున్నట్లు బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఆదిత్యనాథ్‌ను ఈ నియోజకవర్గం నుంచే బరిలోకి దించడంలో బీజేపీ అధిష్టానం మాస్టర్ ప్లాన్ ఉంది.
హిందువులు అధిక ప్రాబల్యం ఉన్న గోరఖ్‌పూర్ స్థానం..1967 జనసంఘ్ కాలం నుంచి బీజేపీకి ఎంతో కీలకంగా ఉంది. అందుకే బీజేపీ అధిష్టానం.. యోగిని గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దించింది.