1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జనవరి 2022 (18:14 IST)

భారత సైనికులకు ప్రధాని 'ఆర్మీ డే' శుభాకాంక్షలు

భారత సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ 'ఆర్మీ డే' శుభాకాంక్షలు తెలియజేశారు. 'ఆర్మీ డే సందర్భంగా మన ధీర సైనికులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. ధైర్య సాహసాలకు, ప్రొఫెషనలిజానికి భారత సైన్యం పెట్టింది పేరు. 
 
దేశ భద్రత కోసం భారత సైన్యం అందిస్తున్న అమూల్యమైన సేవలను వర్ణించేందుకు మాటలు సరిపోవు.' అంటూ నరేంద్ర మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
బ్రిటీష్ వలస పాలనలో ఏప్రిల్ 1,1895న బ్రిటీష్ ఇండియన్ ఆర్మీని స్థాపించారు. భారత్‌కు ఆగస్టు 15,1947న స్వాతంత్య్రం వచ్చినప్పటికీ... ఆ తర్వాత రెండేళ్ల తర్వాత కానీ సైన్యంపై అధికారాలు భారత్‌కు బదిలీ కాలేదు. 
 
ఎట్టకేలకు జనవరి 15, 1949న అప్పటి భారత లెఫ్టినెంట్ జనరల్ కరియప్ప బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ చీఫ్ నుంచి ఫ్రాన్సిస్ బుచర్ నుంచి సైన్యాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.