వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం - ఏడుగురు మృతి
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గౌహతి నుంచి బికనీర్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు జుల్పాయ్‌గురి జిల్లాలోని దోహోమోని అనే ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 12 బోగీలు పట్టాలు తప్పగా, ఏడుగురు మృత్యువాతపడ్డారు.
ఈ ప్రమాదం గురువారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో మరో 50 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమాదం వార్త తెలుసుకున్న వెంటనే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంతో పాటు.. రైల్వే శాఖలు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టింది.
దేశంలో ఇటీవలి కాలంలో రైల్వే ప్రమాదాలు సంభవించలేదు. అంటే 34 నెలల తర్వాత గురువారం ఈ ప్రమాదం జరిగింది. దేశంలో చివరిసారిగా గత 2019 మార్చి 22వ తేదీన రైలు ప్రమాదం జరిగింది. ఆ తర్వాత ఇపుడు ప్రమాదం సంభవించింది.