శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జనవరి 2022 (13:35 IST)

ఘోర రోడ్డు ప్రమాదం- నలుగురు మృతి

బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో శుక్రవారం రాత్రి ట్రక్కు, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలు సహా నలుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు వెల్లడించారు. 
 
ట్రక్ డ్రైవర్ అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. లారీ ఢీ కొనడంతో కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. బెంగళూరులోని పూర్వాంకర అపార్ట్‌మెంట్ సమీపంలోని నైస్ రోడ్డులో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయని, వారిని ఆస్పత్రికి తరలించామని, చికిత్స పొందుతున్నారని వారు తెలిపారు.