గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జనవరి 2022 (11:52 IST)

చైనాలో భారీ భూకంపం : భూకంప తీవ్రత 6.9గా నమోదు

చైనాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.9 ఉన్నట్లు అధికారులు తెలిపారు. కింగ్‌హై ప్రావిన్స్‌లోని మెన్యువాన్‌ కౌంటీలో భూకంపం వచ్చిందని స్థానిక మీడియా తెలిపింది. 
 
జిన్హువా న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. ఇవాళ తెల్లవారుజామున బీజింగ్‌కు 10 కి.మీ లోతులో భూకంపం సంభవించింది. ప్రావిన్షియల్ రాజధాని జినింగ్ సిటీలో బలమైన ప్రకంపనలు వచ్చాయి. 
 
ఈ భూకంపంతో ప్రాణనష్టం సంభవించే అవకాశం తక్కువని, కానీ గణనీయమైన ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని జిన్హువా న్యూస్ తెలిపింది.