శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 జనవరి 2022 (17:19 IST)

డాలియన్ సిటీ మార్కెట్ భూగర్భంలో భారీ అగ్నిప్రమాదం

చైనాలోని డాలియన్ సిటీలోని మార్కెట్ దిగువున ఉన్న భూగర్భంలోని గనిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపుగా ఎనిమది నుంచి పది మంది వరకు ప్రాణాలు చనిపోయినట్టు సమాచారం. ఈ సిటీ ఈశాన్య చైనాలో వుంది. 
 
అలాగే, ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడినట్టు సమాచారం. అయితే, ఈ ప్రమాదంలో గాయపడినవారిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అండర్ గ్రౌండ్‌లో పేలుడు సంభవించడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకోవడంతో ప్రాణాలు కోల్పోయారు. 
 
సమాచారం అందుకున్న చైనా అగ్నిమాపకదళ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకని మంటలను ఆర్పివేశాయి. అలాగే, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.