శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (14:28 IST)

లుథియానా కోర్టులో భారీ పేలుడు : ఇద్దరి మృతి

పంజాబ్ రాష్ట్రంలోని లుథియానా కోర్టులో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కోర్టు బాత్రూమ్ గోడలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కోర్టు ప్రాంగణంలోని రెండో అంతస్తులో ఈ పేలుడు సంభవించగా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
కోర్టు కాంప్లెక్స్‌ రెండో అంతస్తులోని బాత్రూమ్‌లో మధ్యాహ్నం 11.22 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు బాత్రూమ్ అద్దాలు బాగా దెబ్బతిన్నాయి. జిల్లా కోర్టు పని సమయంలోనే ఈ పేలుడు సంభవించింది. 
 
సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన అక్కడకు వెళ్లి కోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే, ఈ పేలుడు సంభవించిన కోర్టు ప్రాంగణం నగరం నడిబొడ్డున కమిషనరు కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉండటం గమనార్హం.