శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 డిశెంబరు 2021 (13:07 IST)

రోజుకి ఒక కోడిగుడ్డు తింటే.. మధుమేహం తప్పదట!

రోజుకి ఒక గుడ్డును ఆహారంలో తీసుకుంటే శరీరానికి మేలు చేసే హెచ్‌డిఎల్‌ కొలెస్ట్రాల్ పెరిగి, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వ్యాధి నిరోధక శక్తిని సైతం పెంచుతుంది. రోజూ ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తినడం వల్ల మధుమేహం బారిన పడుతామని తాజా అధ్యయనం చెబుతుంది.
 
రోజుకు 50 గ్రాముల కన్నా ఎక్కువ గుడ్లు తీసుకుంటే టైప్‌-2 డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు 60 శాతం మేర ఉన్నాయని, పురుషుల కంటే మహిళల్లో ఈ ప్రమాదం మరీ ఎక్కువ ఉందని అధ్యయనం వెల్లడించింది. 
 
1991 నుంచి 2009 వరకు చైనా మెడికల్‌ యూనివర్సిటీ, ఖతార్‌ యూనివర్సిటీలతో కలిసి యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఆస్ట్రేలియా జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.