1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 26 నవంబరు 2021 (23:30 IST)

మధుమేహంతో బాధపడేవారు వీటిని తీసుకుంటే?

జీర్ణవ్యవస్థ మెరుగుపరిచేందుకు ఆకాకర కాయలు ఎంతగానో తోడ్పడతాయి. వంద గ్రాముల ఆకాకరకాయ ముక్కల్లో చాలా తక్కువ సంఖ్యలో కెలొరీలుంటాయి. ఆకాకరకాయ గర్బిణులకు చాలా మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఫొలెట్‌లు శరీరంలోని కొత్తకణాల వృద్ధికి, గర్బస్థ శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది. గర్భిణులు రెండుపూటలా భోజనంలో ఈ కూరను తీసుకోవడం వలన దాదాపు వంద గ్రముల ఫొలెట్ అందుతుంది.

 
మధుమేహంతో బాధపడేవారికి ఆకాకరకాయ చాలా మేలు చేస్తుంది. రక్తంలోని ఇన్సులిన్ స్థాయిల్ని పెంచుతుంది. చక్కెర శాతాన్ని క్రమబద్దీకరిస్తుంది. దీనిలో ఉండే పైటో న్యూట్రియంట్లు కాలేయం, కండర కణజాలానికి బలాన్ని చేకూరుస్తాయి. ఆకాకరకాయను తరచూ తీసుకోవడం వలన దీనిలోని పోషకాలు శరీరంలో ఏర్పడే కేన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి.

 
ఆకాకరకాయలోని విటమిన్ సి శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. దీనిలో ప్లవనాయిడ్లు సమృద్దిగా లభిస్తాయి. ఇవి యాంటీ ఏజింగ్ కారకాలుగా పని చేస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలో లభించే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఈ కూరకు ఎంత ప్రాధాన్యం ఇస్తే అంత మంచిది.