సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 డిశెంబరు 2021 (14:55 IST)

పెరుగుతో బీపీ (అధిక రక్తపోటు)కు చెక్...

ప్రపంచంలో సైలెంట్ కిల్లర్‌గా పేరొందిన వ్యాధి అధిక రక్తపోటు (బీపీ). దీనికి ప్రతియేటా ఎంతో మంది చనిపోతున్నారు. బీపీని నియంత్రించలేక అనేక మంది ఇతర అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. అయితే, సరైన ఆహారం తీసుకుంటే మాత్రం బీపీని నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా, పెరుగుతో బీపీకి చెక్ పెట్టొచ్చని ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పరిశోధకులు తేల్చారు. 
 
అధిక రక్తపోటుతో బాధపడేవారు పెరుగును అధిక మొత్తంలో తీసుకోవడం ద్వారా వారి రక్తపోటు స్థాయిలు గణనీయంగా తగ్గాయని ఇంటర్నేషనల్ డెయిరీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం స్పష్టం చేసింది. పెరుగు వంటి డెయిరీ ఉత్పత్తులు అధిక రక్తపోటును నియంత్రిస్తాయని తమ పరిశోధనలో తేలినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
డెయిరీ ఉత్పత్తుల్లో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి సూక్ష్మ పోషకాలు బీపీ నియంత్రణకు ఉపకరిస్తాయని చెప్పారు. బీపీ అధికంగా ఉన్న సమయంలో పెరుగును కొద్దిగా తీసుకుంటే బీపీ స్థాయి తగ్గుతుందని ప్రయోగాత్మకంగా నిరూపితమైందని వారు తెలిపారు. ముఖ్యంగా, పెరుగును ప్రతి రోజూ తీసుకునేవారిలోనే రక్తపోు స్థాయిలో మరింత మెరుగ్గా ఉన్నాయని చెప్పారు.