తెల్ల ఉల్లిపాయ మధుమేహం పరార్
తెల్ల ఉల్లిపాయల్లో విటమిన్ సి, ఫైబర్స్, పొటాషియం, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. రోజువారీ ఆహారంలో తెల్ల ఉల్లిపాయలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. తెల్ల ఉల్లిపాయలు పొట్ట, ప్రేగుల్లో బ్యాక్టీరియాను తొలగిస్తాయి. తెల్ల ఉల్లిపాయలను రోజూ ఆహారంలో తినడం వల్ల అన్నీ వయస్కుల వారి శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
తెల్ల ఉల్లిపాయల్లో సోడియం ఉంటుంది. ఈ తెల్ల ఉల్లిపాయలు అలర్జీలు మరియు చర్మానికి సంబంధించిన అన్ని వ్యాధులను నియంత్రిస్తుంది.
మధుమేహం ఉన్న వారు తమ రోజువారీ ఆహారంలో తెల్ల ఉల్లిపాయలను తింటే మధుమేహం నియంత్రణలో ఉంటుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. తెల్ల ఉల్లిపాయతో సమాన మొత్తంలో దోసకాయ రసం పిండి తాగితే ఊబకాయం తొలగిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.