గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జనవరి 2022 (13:20 IST)

బాలయ్య ముఖం చూడనిదే పొద్దు గడవదు: పూర్ణ

హీరోల పరంగా చూసుకుంటే తెలుగులో అయితే విజయ్‌ దేవరకొండ, ప్రభాస్‌ అంటే ఇష్టమని హీరోయిన్ పూర్ణ చెప్పింది. అదే బాలీవుడ్ పరంగా చూసుకుంటే సల్మాన్ ఖాన్ ఇష్టమని, అతడిని పెళ్లి చేసుకోవాలని చిన్నప్పటినుంచి అనుకుందట. కానీ ఇప్పుడు అతడిని కేవలం దగ్గర నుంచి చూస్తే చాలు అని సరిపెట్టుకుంది. 
 
ఈ ఇక అసలు విషయంలోకి వెళ్తే..ఇక 'అఖండ' సినిమా షూట్‌లో బాలకృష్ణ ఎనర్జీ చూసి. అంత ఎనర్జిటిక్‌ ఉండాలని అనుకుందట పూర్ణ. అందుకే ఆయన ఫొటోను మొబైల్‌ వాల్‌పేపర్‌గా పెట్టుకుంది. ఆయన ఫొటో చూడగానే కొత్త ఉత్సాహం వస్తుందట. 
 
ఇక ప్రతిరోజూ ఉత్సాహంగా, ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే బాలయ్య ముఖము చూడాల్సిందే అంటూ ఇంటర్వ్యూ ద్వారా తెలిపింది పూర్ణ. ఇక ఏ ఒక్క రోజు ఆయన ఫోటోని చూడకపోతే ఆమెకు రోజంతా గడవటం కష్టమేనట. అందుకోసమే బాలయ్య ముఖాన్ని ప్రతిరోజూ చూస్తాను అని, అలా చూడడం వల్ల రోజంతా హుషారుగా ఉంటానని తెలిపింది పూర్ణ.