శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 డిశెంబరు 2021 (11:54 IST)

శ్రీవారి సేవలో 'అతిలోక సుందరి' తనయ

అలనాటి నటి, అతిలోకసుందరిగా గుర్తింపు పొందిన దివంగత శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి కపూర్ ఆదివారం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దక్షిణభారతావని యువతులకే పరిమితమైన సంప్రదాయమైన లెహంగా హాఫ్ శారీ ఆమె తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం వెలుపలు జాహ్నవి కపూర్‌ను గుర్తించిన భక్తులు ఆమెతో కలిసి సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. 
 
తనతో సెల్ఫీలు దింగేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరితీ ఆమె చిరునవ్వుతో పలుకరిస్తూ ఓపిగ్గా సెల్ఫీలు దిగారు. కాగా జాహ్నవి కపూర్ తిరుమల పర్యటన వీడియో క్లిప్పింగ్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.