బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 24 డిశెంబరు 2021 (23:15 IST)

భక్తులు ఇక నుంచి తిరుమలకు వెళ్ళాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి.. లేకుంటే?

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తులు వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాల‌ని కోర‌డ‌మైన‌ది. ఇదివ‌ర‌కే టిటిడి ఈ విష‌యాన్ని తెలియ‌జేసిన విష‌యం విదిత‌మే.

 
కొంతమంది భ‌క్తులు నెగెటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తుండ‌టంతో అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద నిఘా మరియు భద్రతా సిబ్బంది త‌నిఖీ చేసి అటువంటి వారిని వెన‌క్కి పంపాల్సి వస్తోంది. దీనివ‌ల‌న అనేకమంది భ‌క్తులు ఇబ్బందులకు గురవుతున్నారు.  

 
ఇటీవ‌ల కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోవిడ్- 19 మూడ‌వ వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఖ‌చ్చితంగా వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగెటివ్ సర్టిఫికేట్‌ను అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద చూపించిన వారిని మాత్ర‌మే తిరుమ‌ల‌కు అనుమ‌తిస్తారు.

 
కావున భక్తులు, ఉద్యోగుల మరియు వేలాది మంది సహభక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని టిటిడి విజిలెన్స్ మరియు  సెక్యూరిటి సిబ్బందికి స‌హ‌క‌రించాల‌ని కోర‌డ‌మైన‌ది. టిటిడికి సంబంధించిన ఇత‌ర ఆల‌యాల్లో కూడా ఈ కోవిడ్ నిబంధ‌న‌లు విధిగా పాటించాల‌ని భ‌క్తులను కోర‌డ‌మైన‌ది. టిటిడి ఈ ప్రకటనను విడుదల చేసింది.