తిరుమలేశుని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని రాజ పక్సే కుటుంబం
తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడిని శ్రీలంక ప్రధాన మంత్రి మహేంద్ర రాజ పక్సే దంపతులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీవారి దర్శనార్థం ఆలయ మహా ద్వారం వద్దకు చేరుకున్న శ్రీలంక ప్రధాన మంత్రి రాజపక్సే దంపతులకు రాష్ట్ర ఉపముఖ్య మంత్రి కె. నారాయణస్వామి, టిటిడి జెఈ ఓ వి. వీర బ్రహ్మం, సి వి ఎస్ ఓ గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్ పి వెంకట అప్పలనాయుడు, ఆలయ అధికారులు స్వాగ తం పలికారు.
శ్రీవారి దర్శనాంతరం రంగనాయకుల మండపంలో రాజపక్సే దంపతులకు వేదపండితుల ఆశీర్వాదంతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీలంక నుంచి నేరుగా తిరుమలకు వచ్చిన ప్రధాన మంత్రి రాజపక్సేకు ప్రభుత్వ లాంఛనాలతో స్వాగతం, అతిథి మర్యాదలు చేశారు. తిరుమల దర్శనం, ఇక్కడి టి.టి.డి ఏర్పాట్లపై శ్రీలంక ప్రధాన మంత్రి సంతృప్తిని వ్యక్తం చేశారు.