ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 10 డిశెంబరు 2021 (19:50 IST)

శ్రీ‌వారికి రూ. 3 కోట్ల బంగారు కటి హస్తాల‌ విరాళం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సుమారు 3 కోట్లు విలువ చేసే బంగారు వరద-కటి హస్తాలను ఒక దాత శుక్రవారం విరాళంగా అందించారు. వజ్రాలు, కెంపులు పొదిగిన దాదాపు 5.3 కిలోల బరువు గల ఈ బంగారు వరద-కటి హస్తాలను శ్రీ‌వారి ఆల‌యంలోని రంగనాయకుల మండపంలో టిటిడి అదనపు ఈవో ఎవి. ధర్మారెడ్డికి దాత అందజేశారు.
 
 
అలాగే, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం  డిసెంబర్ 11, 12వ తేదీలలో భక్తులకు టిటిడి అందుబాటులో ఉంచింది. ఈ రెండు రోజుల పాటు  భక్తులు శ్రీవారి లడ్డూ ప్రసాదం పొందవచ్చు. 
 
 
మ‌రో ప‌క్క తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి డిసెంబ‌రు 12న కార్తీక మాసం చివరి ఆదివారం సంద‌ర్బంగా ప్రత్యేక అభిషేకం నిర్వ‌హించ‌నున్నారు. ప‌విత్ర కార్తీక మాసం చివ‌రి ఆదివారం స్వామివారికి తిరుమంజ‌నం నిర్వ‌హించ‌డం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంద‌ర్భంగా స్వామివారికి ఉద‌యం పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రి నీళ్ళ‌తో తిరుమంజ‌నం నిర్వ‌హించి, సింధూరంతో విశేష అలంక‌ర‌ణ చేయ‌నున్నారు.