మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: గురువారం, 2 డిశెంబరు 2021 (19:45 IST)

డాలర్ శేషాద్రి డాలర్ మెడలో వేసుకుని దర్జాగా వెళ్లిపోయిన అధికారి

తిరుమలలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి హల్ చల్ చేశారు. డాలర్ శేషాద్రి మృతి చెందిన మరుసటిరోజే నేరుగా తిరుమలలోని ఆయన నివాసానికి వెళ్ళారు. ఇంట్లోని డాలర్ చైనును మెడలో వేసుకుని వెళ్ళిపోయారు.

 
మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తుండగా హడావిడిగా కారు ఎక్కి వెళ్ళిపోయారు. ఇప్పటికే డాలర్ శేషాద్రి తన డాలర్ చైనును తనకు ఇచ్చినట్లు చెప్పారు ధర్మారెడ్డి.

 
అయితే చనిపోయిన తరువాత డాలర్ శేషాద్రి ఇంటికి వెళ్ళడం.. హడావిడిగా చైను వేసుకుని వెళ్ళిపోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. డాలర్ టిటిడికి చెందింది అయితే ధర్మారెడ్డి తీసుకోవడానికి అధికారం ఉంటుంది.

 
అంతేకాదు తీసుకున్న డాలర్‌ను టిటిడికి హ్యాండోవర్ చేయాలి. అలాంటిది ధర్మారెడ్డి అదేమీ చేయకుండా డాలర్ మెడలో వేసుకుని దర్జాగా వెళ్ళడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.