బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , సోమవారం, 29 నవంబరు 2021 (11:18 IST)

డాలర్‌ శేషాద్రి మృతి త‌ర‌ని లోటు... ధ‌న్య‌జీవి: చంద్రబాబు, వైవీ సుబ్బారెడ్డి

తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శేషాద్రి మృతి టీటీడీకి తీరని లోటని చెప్పారు. ఆయన నిత్యం వేంకటేశ్వరస్వామి సేవలో తరించేవారని, టీటీడీకి విశేష సేవలు అందించారన్నారు. డాలర్‌ శేషాద్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.
 
 
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం బాధాకరమని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శ్రీవారి సేవలో 1978 నుంచి తరిస్తున్న ఆయన మృతి తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. శ్రీవారి సేవే ఊపిరిగా శేషాద్రి పని చేశారని, జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్యజీవి శేషాద్రి అని సుబ్బారెడ్డి అన్నారు. అందరితో ప్రేమగా ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు పెద్ద దిక్కుగా పని చేశారని చెప్పారు. శేషాద్రి ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు.