శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 నవంబరు 2021 (10:58 IST)

సంగారెడ్డిలో 420 కేజీల గంజాయి పట్టివేత

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో ఆ రాష్ట్ర పోలీసులు 420 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 25 లక్షల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు నుంచి అక్రమంగా తరలిస్తుండగా ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఇదే అంశంపై జిల్లా ఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ, ఏపీలోని ఏలూరు నుంచి భారీ మొత్తంలో గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు తమకు సమాచారం వచ్చిందన్నారు. దీంతో జహీరాబాద్ మండలంలోని చిరాక్ పల్లి వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా, ఆ దారిలో వచ్చిన ఒక లారీని ఆపి తనిఖీ చేస్తే ఈ గంజాయి చిక్కినట్టు వెల్లడించారు.
 
మొత్తం 420 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారని, దీని విలువ రూ.25 లక్షలకు పైగా ఉంటుందని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ ప్రాంతానికి చెందిన అశోక్ కేసరి అనే వ్యక్తి డ్రైవరుగా పని చేస్తూ అక్రమంగా గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నట్టు విచారణలో వెల్లడించారని చెప్పారు.