1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 నవంబరు 2021 (12:48 IST)

వచ్చే యేడాదికి తెలంగాణ సర్కారు ప్రకటించిన సెలవులు ఇవే...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే 2022 సంవత్సరానికి సెలవుల జాబితాను ప్రకటించింది. ఇందులో ప్రభుత్వ కార్యాలయాలకు ఏకంగా 28 సాధారణ సెలవులు ఉన్నాయి. మరో 23 రోజులు పాటు ఆప్షన్‌లో సెలవులు ప్రకటించింది. 
 
అయితే, వేతనంతో కూడిన సెలవులను 23గా నిర్ణయించింది. అదేసమయంలో కొత్త సంవత్సరం జననవరి ఒకటో తేదీన ప్రభుత్వం సెలవు ఇస్తున్నందుకు ఫిబ్రవరి రెండో శనివారం పని చేయాల్సివుంటుందని ప్రభుత్వం ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.