1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
  4. Back to School program under the auspices of NATS: NATs for poor children in Telangana

నాట్స్ ఆధ్వర్యంలో బ్యాక్ టూ స్కూల్ కార్యక్రమం: తెలంగాణలో పేద పిల్లలకు అండగా నాట్స్

Back to School
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా విసృత్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని బోధన్ మండలంలో ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులకు బ్యాక్‌ప్యాక్‌లు, నోట్ పుస్తకాలు, పలక‌లు, పెన్నులు, పెన్సిల్‌లు జామెట్రీ బాక్స్‌లను పంపిణీ చేసింది.

 
నాట్స్ సభ్యులు శశాంక్ కోనేరు, గోపి పాతూరి స్థానిక పాఠశాలలతో సమన్వయం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఎత్తోండ, సాలంపాడు, అక్బర్ నగర్ పాఠశాలల్లో విద్యార్ధులకు 300 బ్యాక్‌ప్యాక్‌లను అందించారు. గ్రామీణ ప్రాంతాలలో పేద విద్యార్థుల కోసం నాట్స్ చేసిన ఈ మంచి ప్రయత్నం ఇక ముందు కొనసాగుతుందని విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నే కోరారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ కిషోర్ వీరగంధం, నాట్స్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నేలు ఈ కార్యక్రమానికి తొలి నుంచి మద్దతు అందించడంతో పాటు నాట్స్ సాయం చివరి వరకు చేరేలా పర్యవేక్షణ చేశారు.

 
బోర్డ్ డైరెక్టర్ కిషోర్ వీరగంధం మాట్లాడుతూ... ఉత్తర అమెరికా తెలుగు సంఘం అమెరికాలో మాత్రమే కాకుండా ఇండియాలో మారుమూల గ్రామాల్లో చేస్తున్న సేవలని కొనియాడారు. నాట్స్ సపోర్టర్స్ అయిన శశాంక్ కోనేరు మరియు గోపి పాటూరిలను అభినందించారు.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
మీ చక్కెర తీసుకోవడం ఎలా తగ్గించాలి