శనివారం, 13 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 12 సెప్టెంబరు 2025 (17:16 IST)

Manoj: మిరాయ్ చూశాక ఆనందభరితమైన మంచు మనోజ్ తల్లి నిర్మాలాదేవి

Manchu Manoj, mother Nirmala Devi
Manchu Manoj, mother Nirmala Devi
నిన్న మొన్నటి వరకు మంచు కుటుంబంలో గొడవలు మామూలుగా లేవు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీ లో జరుగుతున్న కొన్ని సంఘటనలను నేరుగా ప్రస్తావించడంతో రచ్చకెక్కిన మంచు విష్ణు, మోహన్ బాబులు ఒకవైపు, మనోజ్ మరోవైపు వున్నారు. ఆస్తిగొడవల కారణంగా ఇదంతా జరుగుతుందని రకరకాలుగా వ్యాఖ్యానాలు వచ్చాయి. మోసం చేసి అన్న మోహన్ బాబు గారిని తనవైపు తిప్పుకున్నాడని ఆరోపణలు కూడా వచ్చాయి.
 
కోర్టు కేసులు, పెద్దల పంచాయితీ అంతా అయిపోయాక కొన్నాళ్ళు గొడవ సద్దుమణిగింది. మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం విడుదలలో ఎంతో పబ్లిసిటీ చేసుకున్న విష్ణు, మోహన్ బాబులు తమకు తెలిసిన ప్రతివారికి సినిమా చూపించారు. స్వామీజీలను కూడా ఆశ్రయించారు. పీఠాధిపతులను ఆశీస్సులు పొందారు. కానీ ఆ సినిమా తర్వాత ఎటువంటి ఫలితం చూసిందో తెలిసిందే. అయినా మనోజ్ కన్నప్ప సినిమాపై మనోజ్ బాగానే స్పందించారు. 
 
ఇక నేడు విడుదలైన మనోజ్ సినిమా మిరాయి ని హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో మనోజ్ తల్లి, సోదరి, భార్య, బంధువులంతా కలిసి తిలకించారు. సినిమా అనంతరం ప్రేక్షకులు అందరూ మనోజ్ కుటుంబంవైపు వచ్చి ఇరగదీశావ్ అన్నా.. చించేశావ్.. అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ఓ దశలో ఐమాక్స్ నుంచి బయటకు రావడానికి చాలా కష్టమైంది మనోజ్ కు. అంతా మిరాయ్ లో తన పాత్రను పోషించాడు. ఇక తాజాగా నేడు మంచు విష్ణు కూడా మనోజ్ పేరు ప్రస్తావించకుండా మిరాయ్ సినిమాకు శుభాకాంక్షలు తెలిపాడు. అదీ కాలంతెచ్చిన మార్పు.