గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 25 నవంబరు 2021 (18:42 IST)

నూతన ప్రచారంతో, తెలంగాణాలోని యువత నడుమ స్వీయ అన్వేషణ శక్తిని వెల్లడిస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌

ఇన్‌స్టాగ్రామ్‌ నేడు తెలుగు భాషలో తమ ప్రకటనా చిత్రం విడుదల చేసింది. దీనిద్వారా తెలంగాణా రాష్ట్రంలోని యువతను తమ వేదికపై తమ వ్యక్తిగత గాథలను వ్యక్తీకరించడంతో పాటుగా అన్వేషించాల్సిందిగా ఆహ్వానిస్తుంది. ఈ చిత్రం ఇన్‌స్టాగ్రామ్‌ ఇటీవల ప్రారంభించిన కన్స్యూమర్‌ మార్కెటింగ్‌ ప్రచారం ‘ వియ్‌ ఆర్‌ ఇన్‌ ద మేకింగ్‌’ లో భాగం. ఈ వారం నుంచి ఇది టీవీలో కనిపించనుంది.

 
ఇన్‌స్టాగ్రామ్‌తో తాము ఎవరనేది అన్వేషించే విధానాన్ని ‘వియ్‌ ఆర్‌ ఇన్‌ ద మేకింగ్‌’ ప్రచారం వెల్లడిస్తుంది. యువత తమను తాము వ్యక్తీకరించుకుంటుంది మరియు కమ్యూనిటీలో భాగం కావాలనుకుంటుంది కానీ తమ చుట్టూ ఉన్న వారి నుంచి నిరంతర ప్రోత్సాహమూ కోరుకుంటుందనే అంశం ఆధారంగా దీనిని రూపొందించారు. యువత వరకూ గుర్తింపు అనేది నిర్వచించబడలేదు, ఈ గుర్తింపు అనేది నిత్యం అన్వేషించతగ్గ అంశం, ఏవిధంగా మన పనులు ముందుకు సాగుతున్నాయనే అంశంతో దీనికి సంబంధం లేదనే వాస్తవం ఆధారంగా ఈ ప్రచారాన్ని తీర్చిదిద్దారు.

 
అవినాష్‌ పంత్‌, డైరెక్టర్-మార్కెటింగ్‌, ఫేస్‌బుక్‌ ఇండియా ఈ అంశం గురించి మరింతగా వెల్లడిస్తూ, ‘‘రీల్స్‌తో మేము లఘు రూపంలో వీడియో సృష్టికర్తలను గణనీయమైన సంఖ్యలో చూశాం. వారు తమ ఆసక్తులను మరింతగా కనుగొనడంతో పాటుగా తమ గొంతునూ కనుగొంటూనే జాతీయ స్థాయిలో ప్రాచుర్యమూ పొందారు. ఇన్‌స్టాగ్రామ్‌ ప్రారంభించిన ఈ నూతన ప్రచారం ద్వారా ఈ స్థానిక పరిజ్ఞానం తీసుకురావడంతో పాటుగా బహుముఖమైన నేటి తరాన్ని వేడుక చేస్తున్నాము. తెలంగాణాలోని యువత తమను తాము వ్యక్తీకరించుకోవడంతో పాటుగా ఇన్‌స్టాగ్రామ్‌పై తమకు తాము ఓ ఆకృతినీ అందించుకోవడానికి ఈ ప్రచారం ప్రోత్సహించనుందని మేము ఆశిస్తున్నాము’’ అని అన్నారు.

 
రీల్స్‌ వినియోగం వల్ల గత సంవత్సర కాలంగా వెలుగులోకి వచ్చిన నూతన క్రియేటర్లలో కనిపిస్తున్న బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్కృతి వృద్ధి చెందడం నుంచి కూడా ఈ ప్రచారం స్ఫూర్తినొందింది. దీనిలో దక్షిణ భారతదేశం నుంచి క్రియేటర్లలో నిర్మల్‌ పిల్లై, సత్సాయా, అభిషేక్‌ కుమార్‌, డెవిల్‌ కుంజు వంటి వారు ఉన్నారు. ఈ ప్రచారం హైదరాబాద్‌లో భౌతికంగా కూడా జరుగుతుంది. ఇది ఇంటరాక్టివిటీ మరియు ఎంగేజ్‌మెంట్‌కు కేంద్రంగా ఉపయోగపడుతుంది. తద్వారా ఈ వేదికపై వారి వ్యక్తిగత కథనాలను వ్యక్తీకరించడానికి, అన్వేషించడానికి నగరంలోని యువకులను ప్రోత్సహించడానికి తోడ్పడుతుంది.