గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (21:11 IST)

బద్వేలు ఉప ఎన్నికలపై రోజా ధీమా, కానీ లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందా..?

ఇప్పుడు అందరి చూపు బద్వేలు ఉప ఎన్నికపైనే కనిపిస్తోంది. వాడివేడిగా సాగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీనే కాకుండా బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. బిజెపి ముఖ్యనేతలైతే రోజుకొకరు ప్రచార పర్వంలో బిజీగా ఉన్నారు. 
 
ఉప ఎన్నికకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్థి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు సిఎం. దీంతో ఆయన అక్కడే ఉంటూ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటున్నారు. అంతేకాకుండా వైసిపిలో జనాకర్షక ఉన్న నేతలు కూడా ప్రచారంలో వెళుతున్నారు.
 
నగరి ఎమ్మెల్యే, వైసిపి ఎమ్మెల్యే రోజా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గోపవరం మండలం రాచాయపేట పంచాయతీలో మండలస్థాయి మహిళా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు రోజా. ఈ సంధర్భంగా ఆమె ప్రసంగం మహిళలను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రతి మాట తూటాలాగా పేలుస్తూ మాట్లాడారు రోజా. 
 
వైసిపి అభ్యర్థి సుధను గెలిపించాల్సిన బాధ్యత మనమే తీసుకోవాలి. ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతోంది. మన అభ్యర్థి ప్రభుత్వ పథకాలే శ్రీరామరక్ష. ప్రతి నిరుపేద ఇంటికి ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయి. ప్రభుత్వం పైనే ప్రజల్లో నమ్మకం పెరుగుతోందనడానికి బద్వేలు ఉప ఎన్నికను ఉదాహరణగా తీసుకుని గెలిపించండి. మన సత్తాను చాటుకుందామన్నారు రోజా. 
 
అలాగే బిజెపి, కాంగ్రెస్ పార్టీలపైనా విమర్సలు చేశారు. ఎపిలో అభివృద్థి రాష్ట్రప్రభుత్వం చేస్తుంటే అభివృద్థిలో సగభాగం మాదంటూ ప్రచారం చేయడాన్ని రోజా తప్పుబట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరని ఆ పార్టీకి ఓటేసేవారే లేరంటూ రోజా స్పష్టం చేశారు.