శనివారం, 23 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వార్షిక ఫలం
Written By రామన్
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (22:21 IST)

శ్రీ శుభకృతు నామ సంవత్సరం రాశి ఫలితాలు.. 12 రాశుల వారి గోచార ఫలితాలు

Astrology
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఆదాయం : 14 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 3 అవమానం : 6
 
ఈ రాశివారి గోచారం పరిశీలించగా ఈ సంవత్సరమంతా అనుకూలంగానే ఉంటుందని చెపవచ్చు. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ధనలాభం ఉంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గత సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఇబ్బందులు తలెత్తుతాయి. 
 
బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పదవులు, సభ్యత్వాల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. వివాహయత్నం ఫలిస్తుంది, అయితే జాతక పొంతన ముఖ్యమని గమనించండి. ఉద్యోగస్తులకు శుభసూచకం. ప్రమోషన్లతో కూడిన బదిలీలుంటాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. స్టాకిస్టులు హోల్ సేల్ వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
విద్యార్థులు అనవసర వ్యాపకాలను తగ్గించుకుంటే కాని లక్ష్యం నెరవేరదు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్యాలపై దృష్టి పెడతారు. తరచు ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆస్తి, కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. ఆస్తి, ఇతర వివాదాలు పరిష్కార దదిశగా సాగుతాయి. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మార్గంలో పయనిస్తుంది.
Astrology
 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆదాయం : 8 వ్యయం : 8 రాజ్యపూజ్యం : 6 అవమానం : 6
 
మీ గోచారం పరీక్షించగా ఈ ఏడాది ఆశాజనకంగానే ఉంది. ఆదాయం బాగుంటుంది. రుణ బాధలు తొలగుతాయి. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. కార్యం సిద్ధిస్తుంది. వాహనం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే కొన్ని చికాకులు తలెత్తే ఆస్కారం ఉంది. వ్యవహారాలు ఆశించినంత ప్రశాంతంగా సాగవు. కొన్ని విషయాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా పెద్దల సలహా పాటించండి. తరచు ఆరోగ్య సమస్యలెదురవుతాయి. వైద్య సేవలతో కుదుటపడతారు. 
 
భవన నిర్మాణాల విషయంలో అభ్యంతరాలు తొలగుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. అవివాహితులకు శుభదాయకం. వృత్తులు, కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు లొంగవద్దు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉపాధ్యాయులకు బదిలీలు ఆందోళన కలిగిస్తాయి. 
 
మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. వ్యాపారాలు ప్రధమార్ధం కంటె ద్వితీయార్థంలో బాగుంటాయి. పెద్దమొత్తం సరుకు నిల్వ శ్రేయస్కరం కాదు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. పాల్గొంటారు. అసాంఘిక కార్యకలాపాలకూ దూరంగా ఉండాలి. 
Astrology
 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 2 అవమానం : 2
ఈ రాశివారికి గృహసంచారం యోగదాయకంగానే ఉంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం బాగుంటుంది. చక్కని ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు మీ స్తోమతకు తగ్గట్టుగానే ఉంటాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, వివాహ సంబంధ ఏజెన్సీలను విశ్వసించవద్దు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. 
 
సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఇతరులకు బాధ్యతలు అప్పగించవద్దు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య ఆస్తి వివాదాలు జటిలమవుతాయి. న్యాయ నిపుణులతో సంప్రదించవలసి వస్తుంది. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకోవటం క్షేమదాయకం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. 
Daily Horoscope
 
అధికారులకు హోదామార్పు, స్థానచలనం. ఉద్యోగస్తులకు యూనియన్ లో గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. పంటల దిగుబడి బాగుంటుంది. గిట్టుబాటు ధర విషయంలో సమస్యలెదురవుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు, నూతన పెట్టుబడులకు అనుకూలం. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. రవాణ, ఎగుమతి దిగుమతి రంగాల వారికి ఆశాజనకం. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
 
 
కర్కాటరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 5 అవమానం : 2
 
ఈ సంవత్సరం ఈ రాశివారి గోచారం ప్రకారం అనుకూలతలు అంతంత మాత్రమే. అవకాశాలు అందినట్టే వెనక్కి వెళ్లిపోతాయి. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించాలి. కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. పట్టుదలతో శ్రమించిన గాని వ్యవహారాలు అనుకూలించవు. మొండి బాకీలు అతికష్టంమ్మీద వసూలవుతాయి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. 
 
సంతానం విషయంలో శుభమే జరుగుతుంది. అవివాహితులకు వివాహయోగం. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధుమిత్రులు చేరువవుతారు. వాహనయోగం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వైద్య సేవలతో కుదుటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, అధికారులకు పదోన్నతి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. విదేశీ విద్యావకాశాలు లభిస్తాయి. 
 
ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ఇబ్బందులెదుర్కుంటారు. వ్యవసాయ తోటల రంగాల వారికి గిట్టుబాటు ధర విషయంలో సంతృప్తి ఉండదు. పంట చేతికొచ్చే సమయానికి వాతావరణం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాలు బాగున్నా సంతృప్తి ఉండదు. భాగస్వామిక వ్యాపారాలు కలిసిరావు. ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. 
Horoscope
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఆదాయం : 8 వ్యయం : 14 రాజ్యపూజ్యం:1 అవమానం : 5
 
ఈ రాశివారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పట్టుదలతో శ్రమిస్తే మీదే విజయం. స్వయంకృషితోనే సత్ఫలితాలు సాధిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిశ్చయమవుతుంది. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి సలహా పాటించండి. 
 
పదవులు బాధ్యతల నుంచి తప్పుకోవలసి వస్తుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు లభిస్తాయి. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. ఉపాధి పథకాలు, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు బాగుంటుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు సదవకాశాలు లభిస్తాయి. కార్మికులకు యోగదాయకం. 
 
మార్కెట్ రంగాల వారికి కొత్త సమస్యలెదురవుతాయి. వ్యవసాయ రంగాల వారికి సామాన్యం. ఎరువులు, క్రమిసంహారక మందుల విక్రయదారులకు కొత్త సమస్యలెదురవుతాయి. పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. ర్యాంకుల సాధనకు విద్యార్థులు ఓర్పు, పట్టుదలతో శ్రమించాలి. అధ్యాపకులకు పనిభారం, విశ్రాంతి లోపం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కళాకారులకు ప్రోత్సాహకరం.
 
 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 4 అవమానం : 5
 
ఈ రాశివారికి ఈ సంవత్సరం ప్రతికూలతలు అధికంగా ఉన్నాయి. అయితే ద్వితీయార్ధం కొంతమేరకు అనుకూలిస్తుంది. ప్రథమార్గంలో వ్యవహారాలు ఆశించంత అనుకూలంగా సాగవు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఖర్చులు విపరీతం, ప్రయోజనకరం. దంపతుల మధ్య అవగాహన లోపం, తరచు అకాల కలహాలు తలెత్తుతాయి. ద్వితీయార్థం ప్రతికూలతలు తొలగి కుదుటపడతారు. 
 
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అవివాహితులకు శుభయోగం. ఆశించిన సంబంధం నిశ్చయమవుతుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల వేధింపులతో మనశ్శాంతి ఉండదు. ఒత్తిడి, పనిభారం. మీ సమర్ధత మరొకరికి కలిసివస్తుంది. వ్యవసాయ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పంట దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
తోటల రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు అంతగా కలిసిరావు. హోల్ సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆటుపోటుపోట్లు, నష్టాలు తప్పకపోవచ్చు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులకు విదేశీ, ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ధార్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. తరచు దైవకార్యాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు విరమించుకోవటం శ్రేయస్కరం.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
ఆదాయం : 8 వ్యయం : 8 రాజ్యపూజ్యం:7 అవమానం : 5
ఈ రాశివారికి ఈ ఏడాది గురువు, శనిలు అనుకూలంగానే ఉన్నా రాహు, కేతువుల సంచారం అధికంగా ఉండటం వల్ల ఊహించని సమస్యలెదురవుతాయి. వ్యవహారాల్లో ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవటం ఉత్తమం. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులు కలిసిరావు. పొదుపునకు ఆస్కారం లేదు. 
 
స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో మెలకువ వహించండి. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. శుభకార్యం తలపెడతారు. పరిచయాలు, బంధువుత్వాలు అధికమవుతాయి. విద్యార్థులు ఉన్నత ర్యాంకులు సాధిస్తారు. దంపతుల మధ్య తరచు కలహాలు, పట్టింపులు తప్పవు. ఉద్యోగస్తులకు పదోన్నతి, స్థానచలనం. అధికారులకు హోదామార్పు, అదనపు బాధ్యతలు. 
 
విత్తనాలు, ఎరువుల వ్యాపారులకు కొత్త కష్టాలెదురవుతాయి. రైతులకు పంట దిగుబడి సంతృప్తినిస్తుంది. భాగస్వామిక వ్యాపారాలు కలిసిరావు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. మార్కెట్ రంగాల వారు లక్ష్యాలను సాధిస్తారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. భవన నిర్మాణ కార్మికులకు పనులు లభస్తాయి. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వైద్య, న్యాయ, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. విదేశీయాన యత్నం ఫలిస్తుంది. సరుకు రవాణాలో జాగ్రత్త. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. స్పెక్యులేషన్ ఒడిదుడుకుల మధ్య సాగుతుంది.
Astrology
 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
ఆదాయం : 14 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 3 అవమానం : 1
ఈ రాశి వారి గోచారం పరిశీలించగా కుజస్తంభన ప్రభావం వల్ల స్వల్ప ఇబ్బందు లుంటాయి. అయితే మిగిలన గృహాలను అనుకూలిస్తాయి. గురు సంచారం వల్ల అన్ని విధాలా ప్రోత్సాహకరంగానే ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. 
 
ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. తరచు ఆరోగ్య సమస్యలెదురవుతాయి. వైద్య సేవలతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త ప్రయోగాలు చేస్తారు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు శుభయోగం. 
 
ఉపాధ్యాయులకు కోరుక్ను చోటికి బదిలీ అవుతుంది. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి దిగుబడి సంతృప్తినిస్తుంది. విత్తనాలు, ఎరువుల వ్యాపారులపై దాడులు అధికమవుతాయి. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఆలయాలకు సాయం అందిస్తారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు లభిస్తాయి. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.
 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం 
ఆదాయం : 2 వ్యయం : 8 రాజ్యపూజ్యం : 5 అవమానం : 1
ఈ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహాన్నీ అనుకూలిస్తాయి. నిజాయితీగా మెలిగి ప్రశంసలందుకుంటారు. ఆదాయం బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వాహనం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. యత్నాలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంది. తరచు వేడుకలు, శుభకార్యాలు చేస్తారు. అవివాహితులకు శుభయోగం. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరుల మధ్య ఆస్తి వ్యవహారాలు ప్రస్తావనకు వస్తాయి. 
 
వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. స్త్రీలకు ధనలాభం, వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. రిటైర్డు ఉద్యోగస్తులకు రావలసిన ఫలితాలు అందుతాయి. అధికారులకు హోదామార్పు.
 
ఉపాధ్యాయులకు స్థానచలనం. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టకాలం. విద్యార్థులు ర్యాంకుల సాధనకు మరింత శ్రమించాలి. విదేశీ విద్యాయత్నం ఫలించదు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు అనుకూలించవదు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఆశాజనకం. తరచు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. కోర్టు వ్యాజ్యాలు, ఇతర వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఆదాయం : 5 వ్యయం : 2 రాజ్యపూజ్యం : 2 అవమానం : 4
ఈ రాశి వారి గోచారం ప్రకారం ఏలిననాటి శని, అర్ధాష్టమ రాహువు, తృతీయ గురువులు ప్రతికూల ఫలితాలే ఇస్తాయి. అయితే మిగిలిన గృహాలు అన్ని విధాలా అనుకూలిస్తాయి. ఓర్పు, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆలస్యంగానైనా సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. కీలక పదవులు అందుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఆదాయం బాగుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకోగల్గుతారు. 
 
దంపతుల మధ్య తరచు అవగాహన లోపం, అకాల కలహాలు తలెత్తుతాయి. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ అవసరం. సంతానానికి విదేశీయానం, ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. వివాహయత్నం ఫలిస్తుంది. శుభకార్యాలను ఘనంగా చేస్తారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. పంట దిగుబడి, గిట్టుబాటు ధర లభిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
 
నూతన వ్యాపారాలు అంతగా కలిసిరావు. హోల్ సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు కొత్త సమస్యలెదురవుతాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. నిరుత్సాహం వీడి ఉద్యోగ యత్నాలు సాగించండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. చాకచక్యంగా వ్యవహరించాలి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
Astrology
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు 
ఆదాయం : 5 వ్యయం : 2 రాజ్యపూజ్యం : 5 అవమానం : 4
ఈ రాశివారికి ఏ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. లక్ష్యసాధనలో అవాంతరాలెదురవుతాయి. పట్టుదలతో కార్యసాధనకు శ్రమించాలి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఏదో సాధించలేకపోయాన్న వెలితి వెన్నాడుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం అనుకూలిస్తుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆశించిన పదవులు దక్కవు. 
 
ప్రత్యర్థులతో సమస్యలు తలెత్తుతాయి. గృహ నిర్మాణాలు చేపడతారు. స్థిరాస్తి క్రయ విక్రయం అనుకూలిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. తరచు అనారోగ్యానికి గురవుతారు. వైద్య సేవలతో ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. 
 
రిటైర్డు ఉద్యోగస్తులకు రావలసిన బెనిఫిట్స్ విషయంలో శ్రమ చికాకులు తప్పవు. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. నూతన వ్యాపారాలు చేపడతారు. వ్యాపారాల ప్రారంభంలో మందకొడిగా సాగినా క్రమంగా పుంజుకుంటారు. హోల్ సేల్ వ్యాపారస్తుల ఆదాయం బాగుంటుంది. చేతివృత్తులు, భవన నిర్మాణ కార్మికులకు ఆశాజనకం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తరచు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. న్యాయ, ఆస్తి వివాదాలు జటిలమవుతాయి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
ఆదాయం : 2 వ్యయం : 8 రాజ్యపూజ్యం :1 అవమానం : 7
ఈ రాశివారి గోచారం పరిశీలించగా శని సంచారం అన్ని విధాలా అనుకూలదాయకమే. కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. విలువైన వస్తువులు అపహరణకు గురవుతాయి. 
 
దంపతుల మధ్య సఖ్యత లోపం. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అధికారులకు హోదామార్పు. ఉద్యోగస్తులకు పదోన్నతి, స్థానచలనం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. రిప్రజెంటేటిన్లు టార్గెట్లను అధిగమిస్తారు. 
 
రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటుంది. న్యాయ, వైద్య, కంప్మూటర్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. విదేశీయానానికి పాస్పోర్టులు, వీసా మంజూరవుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తరచు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య సాగుతుంది. వ్యవసాయంగాల వారికి పంట దిగుబడి బాగున్నా ఆశించిన గిట్టుబాటు ధర లభించదు.